iCafe Search
బ్యాండ్‌విడ్త్ ఎంత లభిస్తుంది
Monday, 7 June 2010ఈ మధ్య ఎక్కడ చూసినా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లు అందిస్తామంటూ
అనేక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇలాంటి సంస్థ రూ.250 కే
unlimited connection, రూ.400లకే 512kbps కనెక్షన్
అంటూ ఊదరగొట్టే ప్రచారాల్లో వాస్తవం ఎంతో తెలుసుకున్న తర్వాతే
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని ఎంచుకోవాలి. సహజంగా ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయి
ఉన్నపుడు మీ కనెక్షన్ ద్వారా ఎంత డేటా సెకనుకు అప్‌లోడ్, డౌన్‌లోడ్
అవుతున్నదీ తెలుసుకోవాలంటే DU Meter అనే సాఫ్ట్‌వేర్ భేషుగ్గా
ఉంటుంది. మీరు నెట్‌కి కనెక్ట్ అయి
రేపిడ్‌షేర్‌కి గుడ్‌బై చెప్పండి
ఇంటర్‌నెట్‌పై ఉచితంగా ఫైళ్ళని స్టోర్ చేసుకోగలిగే సర్వీస్‌ని అందిస్తున్న Rapidshare తనకున్న పాపులారిటీని అడ్డుపెట్టుకుని ఫ్రీ యూజర్లని Download limitలు, ఇతర నియమాల పేరిట ఎంత విసిగిస్తుందో తెలిసిందే. దీని తలనొప్పులు తొలగిపోవాలంటే
ఫొటోలను ఎడిట్ చేసి సేవ్ చేసేటప్పుడు..
ఫొటోషాప్ వంటి పవర్ ఫుల్ ఇమేజ్ ఎడిటింగ్ సాప్ట్ వేర్ల సాయంతో రకరకాల ఇమేజ్ లను వివిధ Layersగా అమర్చుకుని అందంగా డిజైన్ చేసినప్పుడు దానిని BMP వంటి ఫొటో ఫార్మేట్లలోకి సేవ్ చేస్తే అందులోని లేయర్లు అన్నీ గ్రూప్ చేయబడతాయి. దానితో భవిష్యత్ లో ఆ ఇమేజ్ లో పొందుపరిచిన లేయర్లని విడివిడిగా ఎడిట్ చేయడానికి వీలుపడదు. కాబట్టి ఎంతో కష్టపడి వివిధ లేయర్లని అమర్చుకుని, పలు రకాల ఫిల్టర్లని
CDలు ఎలా పని చేస్తాయంటే..
1.22mm మందం కలిగిన ప్లాస్టిక్ ముక్కగా సిడిని పరిగణించవచ్చు. Polycarbonate ప్లాస్టిక్‌తో సిడిలను తయారుచేస్తారు. తయారీ దశలో ఆ ప్లాస్టిక్ పై పల్చని రిఫ్లెక్ట్ అయ్యే అల్యూమినియం పొరని అమర్చుతారు. ఆ అల్యూమినియం పొరను కాపాడడానికి దానిపై మరో పల్చని Acrylic పొరని పొందుపరుస్తారు. చివరిగా దానిపై కంపెనీ లేబుల్‌ని ప్రింట్ చేస్తారు. లోపలి నుండి బయటకు వంపులుగా అమర్చబడి ఉన్న ఒకే ఒక ట్రాక్ సిడిపై పొందుపరచబడుతుంది. సిడిపై ఉండే ట్రాక్ 0.5 మైక్రాన్ల మందంతో (మైక్రాన్ అంటే మీటర్‌లో మిలియన్ వంతు అని అర్ధం) లోపలి వంపుకి దాని తర్వాత వచ్చే వంపుకి మధ్య 1.6 మైక్రాన్ల గ్యాప్ తో పొందుపరచబడి
హార్డ్‌డిస్క్ జీవితకాలం తెలుసుకోవడం ఇలా…
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అన్ని హార్డ్‌డిస్క్‌ల్లోనూ SMART (Self Monitoring And Reporting Tool) టెక్నాలజీ పొందుపరచబడి ఉంటోంది. దీన్ని ఆధారంగా చేసుకుని మన హార్డ్‌డిస్క్ ఎంత మెరుగ్గా పనిచేస్తోందీ, Spin Up Time, Reallocated Sector Count వంటి పలు వివరాలతో పాటు ప్రస్తుతం ఉన్న కండిషన్‌లో హార్డ్‌డిస్క్ ఎన్నాళ్ళపాటు పనిచేస్తుందీ (తేదీతో సహా)తెలియజేసే మృదులాంత్రం (Software) ఒకటి ఉంది. అదే
Word ఫైళ్ళు ఫోటోలుగా సేవ్ చేయొచ్చా?
Wordలో టైప్ చేసిన తెలుగు ఫాంట్లు ఆ ఫాంట్లు లేని సిస్టమ్‌లో ఓపెన్ అవవు కదా! అవి వేరే సిస్టమ్‌లో కనిపించాలంటే వర్డ్ నుండి పిక్చర్‌గా మార్చుకోవాలి.Word, Excel, Pagemaker వంటి ఏ ప్రోగ్రామ్‌లో మనం డిజైన్ చేసుకున్న డాక్యుమెంట్లనైనా కీబోర్డ్‌పై PrintScreen కీని ఉపయోగించి BMP ఇమేజ్‌గా పొందవచ్చు. ఒకవేళ పేజీ హైట్ స్క్రీన్ హైట్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే
మెమరీ Latency గురించి తెలుసా?
కంప్యూటర్‌ని ఆన్ చేసి మనం పనిచేసుకుంటూ పోతాం.మనం టైప్‌చేసే డేటా మొత్తం సైలెంట్‌గా RAM మాడ్యుళ్ళలో తాత్కాలికంగా భద్రపరచబడుతుంది. ఎప్పుడైతే మనం ఫైల్‌ని సేవ్ చేస్తామో అప్పుడు ఆ సమాచారం RAM నుండి హార్డ్‌డిస్క్‌కి సేవ్ చేయబడుతుంది.చాలామందికి ఇంతవరకు మాత్రమే తెలుసు తప్ప RAM పనితీరు ఇంతకన్నా వివరంగా తెలియదు.. ఒక్కసారి నిలువు,అడ్డ గళ్ళతో కూడిన లుంగీలను గుర్తు తెచ్చుకోండి. ప్రతీ నిలువు,అడ్డ గడి కలిసే చోట ఒక పెట్టె తయారవుతుంది కదా! సరిగ్గా అదే పద్ధతిలో మెమరీ అడ్రస్‌లు పలు పెట్టెలుగా ఉంటాయి.సిపియు నుండి ఏదైన సమాచారం అందించమని అభర్థన పంపించబడితే మెమరీ ముందు ఆ సమాచారం ఏ అడ్డువరుసలో ఉందో చెప్పమని సిపియుని కోరుతుంది. ఆ వివరాలు లభించేటంత వరకూ ఆగుతుంది. ఇలా
కార్డ్‌లు డిజైన్ చేయడం ఎలా?
ప్రొఫెషనల్ క్వాలిటీ విజిటింగ్ కార్డులు, ఫోటో ఐడెంటిఫికేషన్ బ్యాడ్జ్‌లు, ఎన్వలప్‌లు,లేబుళ్ళూ,బార్‌కోడ్‌లు మొదలైనవి డిజైన్ చేయడానికి ఉపకరించే ప్రోగ్రామే Print Studio ఈ ప్రోగ్రామ్‌లో రెడీమేడ్‌గా, ఎక్కువగా వాడుకలో ఉన్న వివిధ పరిమాణాల టెంప్లేట్లు పొందుపరచబడి ఉన్నాయి.Custom Sizes కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ www.jollytech.com సైట్‌లో లభిస్తోంది.
MP3 ఫైళ్ళ కటింగ్‍కి ఓ సాఫ్ట్ వేర్..
మీరొక పాట వింటున్నారనుకుందాం. అందులో చాలా బాగా నచ్చిన బీజియమో,
మ్యూజిక్ సీక్వెన్సో మాత్రమే సాంగ్ నుండి సపరేట్ ఫైల్‍గా తీసుకోగలిగితే బాగుణ్ణు
అని అనిపించవచ్చు. లేదా మీరు వింటున్న MP3 సాంగ్స్ల్ లో, సాంగ్ మొదటా,
చివర్లలో ఉండే సైలెన్స్ ని తొలగించి కేవలం సాంగ్‍ని మాత్రమే సేవ్ చేసుకోదలుచు
కున్నపుడు MPEG Audio Scissors అనే మృదులాంత్రం(Software)
ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. VCD cutter మాదిరిగానే ఈ మృదులాంత్రంలోనూ
MP3 ఫైలులో ఎక్కడి నుండి మనకు కావాలో ఆ ప్రదేశాన్ని Start Frame గానూ,
ఎక్కడివరకైతే పాట కావాలో ఆ భాగాన్ని End Frame గానూ డిఫైన్ చేసి, Start
Processing/Save to file అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఒకేసారి పలు ఫైళ్ళనూ క్లిప్ చేయవచ్చు.
PDF నుండి టెక్స్ట్ ఫార్మేట్‍లోకి…
వందలాది పేజీలు గల PDF డాక్యుమెంట్లలోని సమాచారాన్ని TEXT ఫార్మేట్‍లోకి
కన్వర్ట్ చేసుకోవడానికి ముందుగా ఆ PDF ఫైల్‍ని Acrobat Reader
మృదులాంత్రముతో ఓపెన్ చేసుకుని అందులో ప్రతీ పేజీలోని టేక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని
మరో ప్రక్క Notepad ప్రోగ్రామ్‍ని ఓపెన్ చేసుకుని అందులో పేస్ట్ చేయ్యవలసి
ఉంటుంది. ఈ తతంగం ఏమీ లేకుండా మనం ఏ PDF ఫైల్‍ని ఇన్‍పుట్‍గా ఇచ్చినా
దానిలో ఉన్న సమాచారం మొత్తాన్ని మనమ్ సెలెక్ట్ చేసుకున్న లోకేషన్‍లో Text
ఎలక్ట్రానిక్ డిజైన్లకి దీనిని మించింది లేదు..
ఎలక్ట్రానిక్ డిజైన్లని తయారు చెయ్యవలసి వచ్చినపుడు అందులో ఉపయోగించే
కెపాసిటర్లు, ట్ర్రాన్సిస్టర్లు, Diodes, రెసిస్టర్లు, సెమీకండక్టర్లు, స్విచ్‍లు,
ట్రాన్స్ఫార్మర్లు, వాల్వులు, ఓల్టేజి కంట్రోల్ వంటి విభిన్నమైన అంశాల
చిహ్నాలను ఉపయోగించవలసి వస్తుంటుంది. మామూలు డ్రాయింగ్
మృదులాంత్రముల ద్వారా వీటిని డిజైన్ చెయ్యడం కత్తి మీద సాము లాంటిది.
ఈ నేపధ్యంలో ఎలక్ట్రానిక్ డిజైనర్లకు, బుక్ పబ్లిషర్లకు ఉపయోగపడే విధంగా
Electronic Design Studio అనే మృదులాంత్రం (Software)
డెవలప్ చేయబడింది. ఒక్కసారి ఈ మృదులాంత్రాన్ని ఇన్‍స్టాల్ చేసి చూస్తే
ఇందులో పొందుపరచబడిన వందలకొద్ది మోడళ్ళని చూసి ఆశ్చర్యపోతారు
ఆకర్షణియమైన ఫ్లాష్ ప్రజంటేషన్లకు….
వ్యాపార, విద్యారంగాలలో ఎంతో నాణ్యతతొ తక్కువ పరిమాణంలో ఇమిడిపోయే
ఫ్లాష్ ప్రజంటేషన్లకు ఎంతో ప్రాధాన్యత లభిస్తోంది అయితే Macromedia Flash
ప్రోగ్రామ్‌ని నేర్చుకోవడం సులభంగా సాధ్యపడే వ్యవహారం కాదు. ఈ నేపధ్యంలో
PowerBullet అనే మౄదులాంత్రము(Software) సాయంతో PNG,
GIF, JPEG వంటి ఇమేజ్ ఫార్మేట్లు, MP3, WAV వంటి ఆడియో
ఫార్మేట్లకు చెందిన ఫైళ్ళ ఆధారంగా మనకు నచ్చిన విధంగా ఆటోమేటిక్‌గా ప్లే
అయ్యే ఆకర్షణీయమైన ఫ్లాష్ ప్రజంటేషన్లని చాల సులభంగా రూపొందించుకోవచ్చు.
ప్రజంటేషన్లో ప్లే అయ్యే ప్రతీ పేజీకి ట్రాన్సిషన్ ఎఫెక్టులు జతచేసుకోవచ్చు.
ప్రజంటేషన్‌లను పుల్ స్క్రీన్‌లో ప్లే చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌తో పాటు అందులోని
సౌండ్ సింక్రనైజ్ అయ్యే విధంగా ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌ని EXE ఫైల్‌గా
సేవ్ చేసుకోగలిగే ఈ
ప్లగ్-ఇన్స్ గురించి తెలుసుకుందాం
‘మా సిస్టమ్‌లో వెబ్‌సైట్లలోని ఫ్లాష్ ఏనిమేషన్లు ప్లే అవడంలేదు.’అని కొందరు కంప్లేంట్లు చేస్తుంటారు. ఫోటోషాప్‌లో ఫలానా ప్లగ్ ఇన్ చాలా ఉపయోగకరంగా ఉందంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అనేక సందర్భాల్లో ఈ Plug-ins అనే పదం మనకు వినిపిస్తున్నా దాని గురించి వివరంగా అందరికీ తెలీదు.
Plug-in అంటే ఏమిటి?
మెయిల్ చదివింది లేనిది తెలుసుకోవడమెలా???
మనం మన స్నేహితులకు పంపించే మెయిల్స్‌ని వారు రిప్లై ఇచ్చేవరకు వారు వాటిని చదివింది లేనిదీ అర్ధం కాదు. అయితే ఓ చిన్న చిట్కాని పాటించడం ద్వారా మనం పంపించిన మెయిల్ మెసేజ్‌ని వారు ఎప్పుడు చదివినది, వారికి తెలియకుండానే మనం ఓ రిపోర్ట్ ద్వారా పొందవచ్చు. అదెలాగంటే
మౌస్ ఇష్టమొచ్చినట్టు మూవ్ అవుతుందా…
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‍లో ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవడానికి, దాదాపు అన్నిరకాల
ఇతర పనులకూ మౌస్ లేనిదే కష్టం. అయితే ఒక్కోసారి మౌస్ పాయింటర్ మన
చేతితో మూవ్ చేస్తున్న పద్ధతికి అనుగుణంగా కాకుండా, మరీ స్లోగా కానీ,జెర్కీగా
గానీ మూవ్ అవుతుంటుంది.
మీ మెయిల్ స్పామ్ కాకుండా…
మీ ఫ్రెండ్‍కొక ముఖ్యమైన మెసేజ్ పంపించారనుకోండి. అయితే పొరబాటున అది Bulk ఫోల్డర్‍లోకి వెళితే, దానిని చెక్ చేసుకోకుండానే అతను ఆ ఫోల్డర్‍ని క్లీన్ చేస్తే మీరు పంపించిన మెసేజ్ నిరుపయోగమైనట్లే కదా! అవును… అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం పంపించే మెసేజ్‍లలో Yahoo, Rediff, Gmail వంటి సర్వర్లలోని స్పామ్ ఫిల్టర్లు వడగట్టే ఏ ఒక్క లక్షణం ఉన్నా మన మెయిల్ అవతలి వ్యక్తి Inbox కి వెళ్ళడానికి బదులు Junk/Bulk/Spam ఫోల్డర్లకి చేరుకుంటుంది. ఒక్కోసారి మనం పంపించే మెసేజ్‍లలోని సబ్జెక్ట్ లైన్‍లను చూడగానే రిసీవ్ చేసుకున్నవారు స్పామ్ మెసేజ్ అని పొరబాటుపడి డిలీట్ చేసే అవకాశామూ ఉంది. ఈ నేపధ్యంలో మన మెసేజ్ స్పామ్‍గా పరిగణించబడకుండా ఉండాలంటే మెయిల్ పంఫించేటప్పుడు క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు
ప్రస్తుతం 250GB వరకూ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఇంటర్నల్ హార్డ్ డిస్క్‌లు లభిస్తున్నాయి. వీటి కొనుగోలు సమయంలో చాలా మంది ఏమాత్రం శ్రద్ధ చూపించరు. హార్డ్ డిస్క్‌లను కొనేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన వివిధ అంశాల గురించి క్రింద డీటైల్డ్‌గా వివరించడం జరిగింది.
స్పీకర్లని కొనుగోలు చేయబోతున్నట్లయితే..
పవర్ రేటింగ్ : మార్కెట్లో లభిస్తున్న అన్ని స్పీకర్లూ పవర్ రేటింగ్‌ని PMPO ప్రమాణంలో పేర్కొంటున్నారు. అయితే PMPO అర్ధం లేని స్పెసిఫికేషన్! దీనికి బదులు స్పీకర్ సిస్టమ్ యొక్క RMS పవర్‌ని పరిగణనలోకి తీసుకోండి. సరౌండ్ సౌండ్ స్పీకర్ల విషయంలో కనీసం 40 Watts RMS పవర్ ఉన్న స్పీకర్లని ఎంచుకోవడం మంచిది. నిరంతరాయంగా పవర్‌ని హ్యాండిల్ చెయ్యగల సమర్ధత స్పీకర్‌లో ఎంత ఉందో తెలుసుకోవడానికి RMS మాత్రమే సరైన ప్రమాణం.
ఇన్‌స్టెంట్ మెసెంజర్
Yahoo, GTalk, MSN, AIM, Jabber వంటి అనేక ఇన్‌స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాములు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. వీటి ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడడం మాట అటుంచితే విలువైన పని గంటలు వృధా అవడం, తెలిసీతెలియక యువత పెడదారి పట్టడం, వ్యక్తిగత సమాచారం ఎవరికి బడితే వారికి చెప్పడం వంటి అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో మీ కంప్యూటర్‌లో Yahoo,Google Talk, MSN, AIM,Odigo, PalTalk, QQ Messenger, Jabber, IMessenger.Net, AOL, IRC, ICQ, GAIM వంటి ఏ రకమైన ఇన్‌స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాం పనిచేయకుండా లాక్ చెయ్యడానికి http://www.comvigo.com/downloadIMLock/IMLSetup.exe అనే వెబ్ సైట్లో లభించే Im Lock Home Edition అనే ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాం సహాయంతో అవసరం అనుకుంటే iTunes, Internet Explorer, Skype ప్రోగ్రాములు సైతం పనిచెయ్యకుండా లాక్ చేసుకోవచ్చు. ప్రైవసీ,సెక్యూరిటీ కోరుకునేవారికి పనికొచ్చే సాప్ట్ వేర్ ఇది.
సిస్టమ్ ఆన్‍లో ఉన్న సమయం
కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత ప్రస్తుతం వరకూ ఎంత సమయం సిస్టం ఆన్‌లో ఉందో తెలుసుకోవడానికి 44KB సైజ్ గల uptime.exe anE అనే చిన్న ప్రోగ్రాం లబిస్తోంది. దీన్ని http://support.microsoft.com/kb/232243 అనే మైక్రోసాప్ట్ వెబ్‍సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత Start>Run కమాండ్ బాక్స్‌లో command అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ వద్ద నుండి uptime ప్రోగ్రాంని రన్ చేస్తే ఎంతసేపటి నుండి రన్నింగ్‌లో ఉందన్న సమాచారాన్ని తెలియ చేస్తుంది. అలాగే ఇందులోని advanced ఆప్షన్‌ని గనుక సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ ఎప్పుడు షట్‌డౌన్, రీస్టార్ట్ చెయ్యబడింది, ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్‌లకు సంబంధించిన సమాచారం, మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న సర్వీస్‌ప్యాక్ వివరాలు లభిస్తాయి. WinXPలో మాత్రమే ఇది పనిచేస్తుంది.
ఆటోమాటిక్ క్లోజ్
రన్నింగ్ ప్రాసెస్లు ఆటోమేటిక్‌గా క్లోజ్ చెయ్యబడేలా..
విండోస్‌ని షట్‌డౌన్ చేసేటప్పుడు ఒక్కోసారి మెమరీలో ఏవైనా ప్రోగ్రాములు రన్
అవుతున్నట్లయితే “ఫలానా ప్రోగ్రామ్ రన్ అవుతోంది.దాన్ని క్లోజ్ చెయ్యమంటారా”
అనే వార్నింగ్ మెసేజ్ చూపించబడుతుంది.అన్ని ప్రోగ్రాములు క్లోస్ చెయబడిన
తర్వాతే సిస్టం షట్‌డౌన్ అవుతుందని మనకు తెలిసిందే. అలాంటప్పుడు ఫలానా
ప్రోగ్రాంని క్లోజ్ చెయ్యమంటారా అని Windows మన ముందు క్వశ్చన్‌మార్క్
పెట్టకుండా ఆటోమేటిక్‌గా రన్ అవుతున్న టాస్క్‌లను క్లోజ్ చెయ్యడానికి రిజిస్ట్రీలో..
IE లో వెబ్ పేజీ సోర్స్ కోడ్ చూడకుండా.
నెట్ ద్వారా ఏదైనా వెబ్‌పేజ్‌ని ఓపెన్ చేసినప్పుడు వెబ్‌పేజ్‌లో మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి
View Source అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ వెబ్‌పేజ్ యొక్క
సోర్స్‌కోడ్ ఓ Notepad విండోలో ఓపెన్ అవుతుంది. Windows XP
ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇలా రైట్‌క్లిక్ కాంటెక్స్ట్ మెనూలో ViewSource అనే
ఆప్షన్ కనిపించకుండా చేయాలంటే రిజిస్ట్రీ ఎడిటర్ ప్రోగ్రామ్‌లో
బ్రౌజింగ్ హిస్టరీని తొలగించడానికి షార్ట్ కట్ లు
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరల్ ప్రోగ్రాం ద్వారా వెబ్ సైట్లని బ్రౌజ్ చేసేటప్పుడు ఆయా వెబ్ పేజీల్లోని సమాచారం కంప్యూటర్ లో Temporary Internet Files అనే ఫోల్డర్లో సేవ్ చెయ్యబడుతుంటుంది. అలాగే మనం ఏయే వెబ్ పేజీల్ని ఓపెన్ చేశామన్నది History అనే ఫోల్డర్లో వివరాలు నమోదు చేయబడుతుంటాయి. కొంతవరకూ ఇది ప్రయోజనకరమే గానీ, కొన్ని సందర్భాల్లో మనం ఓపెన్ చేసిన వెబ్ సైట్ల వివరాలు ఇతరులు తెలుసుకునే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో Temporary Internet Files, History ఫోల్డర్లని క్లీన్ చేయడానికి నేరుగా డెస్క్ టాప్ పై షార్ట్ కట్ లను స్ళష్టించుకునే మార్గం ఉంది. అదెలాగంటే
బ్లాక్ అండ్ వైట్
ఇటీవల టెలివిజన్ ఛానెళ్లలో కనిపిస్తున్న కొన్ని ప్రకటనల్లో మనిషి బ్లాక్ అండ్ వైట్ లోనూ, కట్టుకున్న చీర, పెట్టుకున్న నగలు కలర్ లోనూ స్పెషల్ ఎఫెక్ట్ మాదిరిగా కనిపిస్తున్నాయి. ఫొటోషాప్ సాప్ట్ వేర్ ద్వారా మనమైనా ఇలాంటి ఎఫెక్ట్లులు చాలా సులభంగా సాధించవచ్చు. పొటోషాప్ లో ఏదైనా కలర్ ఇమేజ్ ని ఓపెన్ చేసి Image>
AutoCAD సాప్ట్ వేర్
BMP,JPG, GIF వంటి సాధారణ ఇమేజ్ ఫార్మేట్లకు చెందిన ఫొటోలను చూడడానికి ACDSee, CompuPic వంటి సాప్ట్ వేర్లు ఎలా ఎలా పని చేస్తాయో అదే విధంగా ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు ఉపయోగించే AutoCAD సాప్ట్ వేర్ కి సంబంధించిన DWG, DXF డిజైన్లని ఆయా సాప్ట్ వేర్లు ఇన్‌స్టాల్ చేయబడి లేకపోయినా సులభంగా చూడడానికి, ప్రింట్ తీసుకోవడానికి DWGSee 2008 అనే సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. అన్ని విండోస్ వెర్షన్లపై ఈ ప్రోగ్రాం పని చేస్తుంది.
MAC Address Change సాప్ట్ వేర్
మనం కొనుగోలు చేసే ప్రతీ LAN కార్డ్ కీ లేదా మన మదర్ బోర్డ్ పై అంతర్గతంగా పొందుపరచబడి ఉండే LAN చిప్ కీ ప్రత్యేకంగా ఫిజికల్, పర్మినెంట్ అడ్రస్ అంటూ ఒకటి ఉంటుంది. దానినే MAC అడ్రస్ అంటుంటారు. ఈ MAC అడ్రస్ మరియు సిస్టం యొక్క IP అడ్రస్ ల ఆధారంగా నెట్ వర్క్ లో ఏమి జరుగుతోందన్నది (నెట్ వర్క్ ట్రాఫిక్, పాకెట్లను విశ్లేషించడం ద్వారా) నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్లు పర్యవేక్షించగలుగుతారు. వాస్తవానికి ఈ పర్మినెంట్ అడ్రస్ ని మార్చడానికి వీలుపడదు. అయితే
సిడి డ్రైవ్ ప్రాబ్లెమ్
Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో సిడిరామ్ డ్రైవ్ నుండి కొంత డేటాని సిస్టమ్‌లోకి
కాపీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నా లేదా సిడిలో ఉన్న ఏదైనా సాప్ట్ వేర్ ని ఇన్‌స్టాల్
చెయ్యబోతున్నా.. The request could not be performed
because of an I/Q device error లేదా only part of a
read process memory or write process memory request
was completed అనే మాదిరి ఎర్రర్ మెసేజ్‌లు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంటే విండోస్
XP ఆపరేటింగ్ సిస్టమ్ మీ వద్ద ఉన్న సిడిరామ్ డ్రైవ్ సపోర్ట్ చెయ్యని ట్రాన్స్‌ఫర్ మోడ్‌ని
దానికి సెట్ చేసినట్లుగా భావించవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో..
Start>Run కమాండ్ బాక్స్‌లో
ఆటోమేటిక్ గా లాగిన్
సహజంగా విండోస్ XP ఇన్ స్టాల్ అయి ఉన్న కంప్యూటర్లో సిస్టం ని బూట్ చేసినప్పుడు పలు యూజర్ అకౌంట్లు మన సిస్టంలో ఉన్నట్లయితే ఏ యూజర్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలో ఎంచుకోమని కోరబడుతుంది.
DeepFreeze అనే సాప్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేసుకుంటే
DeepFreeze అనే సాప్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేసుకుంటే వైరస్‌లు, సిస్టమ్ క్రాష్‌లు, అప్లికేషన్ ఎర్రర్లు వంటి ఎలాంటి సమస్య వచ్చినా ఒక్కసారి కంప్యూటర్‌ని రీస్టార్ట్ చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఒకటికన్నా ఎక్కువ హార్డ్‌డిస్క్‌లను సైతం ఇది సపోర్ట్ చేస్తుంది. FAT16, FAT32, NTFS వంటి అన్ని ఫైల్ సిస్టమ్‌లకు చెందిన డ్రైవ్‌లను ఇది ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. కేవలం 2MB మాత్రమే
USB 1.1 పోర్ట్‌లకు
తాజాగా మార్కెట్లో లభిస్తున్న స్కానర్లు, ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌లు, DV కామ్‌కోడర్లు హైస్పీడ్ డేటా ట్రాన్స్‌ఫరింగ్ కోసం USB 2.0, Firewire ఇంటర్‌ఫేస్‌లను కలిగి ఉంటున్నాయి. కొత్త కంప్యూటర్లు ఎటూ USB 2.0 సపోర్ట్ ని కలిగి ఉంటున్నాయి. అయితే USB 1.1 పోర్ట్లులు ఉన్న పాత కంప్యూటర్లలో గరిష్టంగా సెకనుకు 12 మెగాబైట్ల డేటాని మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతుండగా USB 2.0 సెకనుకు 480MB డేటా వరకు ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతుంది.ఎంత వృత్యాసం ఉందో చూడండి.
డేటా రీడ్ అవని సిడిల నుండి
సిడిలపై బాగా గీతలు పడడం వల్ల , ఇతరత్రా కారణాల వల్ల అందులోని డేటా రీడ్ అవని సిడిల నుండి సమాచారాన్ని ర్జికవర్ చెయ్యడానికి BadCopy Pro అనే సాఫ్ట్ వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లాపీ డిస్క్ ల్లోని డేటాని కూడా రికవర్ చేసే ఈ సాఫ్ట్ వేర్ డిస్కుల్లోని చిన్న చిన్న బ్లాక్‌లుగా విశ్లేషించి అందులో సాధ్యమైనంత సమాచారాన్ని వెలికితీయడానికి ప్రయత్నిస్తుంది. సాధారణ విండోస్ కమాండ్లు Copy, Paste వంటివి చేతులెత్తేసే డిస్క్ ల నుండి సైతం ఇది విజయవంతంగా సమాచారాన్ని రికవర్ చెయ్యగలుగుతుంది. అయితే డేటా బాగా డామేజ్ అయి ఉంటే, ఫైల్‌ని రికవర్ చెయ్యగలిగినా అది ఏమాత్రమూ ఉపయోగపడదు. దీనికి కారణం వీలైనన్ని డేటా బ్లాక్‌లని రికవర్ చేయగలదే తప్ప మొత్తం బాగా డామేజ్ అయిన డేటాని ఏ సాఫ్ట్ వేరైనా ఏం చెయ్యగలుగుతుంది చెప్పండి.
కంప్యూటర్ విశిష్టతలు
1.స్పీడ్: కంప్యూటర్ అనేది ఎప్పుడూ చాలా పాస్ట్ గా వర్క్ చేస్తుంది. ఇది ఎంతపాస్ట్ గా వర్క్ చేస్తుందంటే ఒకసెకనుకి మిలియన్ ఆఫ్ కాలిక్యులేషన్స్ చేస్తుంది.
కంప్యూటర్లో పార్టులు
కంప్యూటర్లో మనకి ఎక్కువగా ఉపయోగపడే పార్టులని ముఖ్యమైన పార్టులుగా చెప్పవచ్చు.
అవి.
మెమొరీ
కంప్యూటర్ లో మనం ఎంటర్ చేసిన మేటర్ అంతా కంప్యూటర్ యొక్క మెమొరీలో తిరిగి మనకి కావలసినపుడు ఉపయోగించుకునే విధంగా స్టోర్ అవుతుంది.తర్వాత ఈ మేటర్ లో ఏమైనా కాలిక్యులేషన్స్ ఉంటే ఇది సి.పి.యు.లో ఉన్న ఎ.ఎల్.యు. కి కాలిక్యులేషన్స్ కోసం పంపబదుతుంది.
కంప్యూటర్ లో రెండు రకాల మెమొరీలు ఉంటాయి.
అవి.
సి.పి.యు. అంటే
సి.పి.యు. అంటే సెంట్రల్ ప్రోసెసిం గ్ యూనిట్. మిగిలిన కంప్యూటర్ పార్ట్స్ అన్నీ కేబుల్ ద్వారా సి.పి.యు.కి కలపబడి ఉంటాయి. మనం కంప్యూటర్ కి ఇచ్చిన ఇంపర్ మేషన్ స్టోరేజ్, కాలిక్యులేషన్ అంతా కూడా సి.పి.యు. లోనే జరుగుతుంది.ఈ సి.పి.యు. లేకపోతే మిగిలిన కంప్యూటర్ పార్టులు పనిచేయవు. మనకి బ్రెయిన్ లేకపోతే మనం ఏపనీ చేయలేం. అలాగే సి.పి.యు. లేకపోతే మిగిలిన పార్టులు పనిచేయవు, కనుక సి.పి.యు.ని బ్రెయిన్ ఆప్ ది కంప్యూటర్ అని పిలుస్తారు.
ఈ సి.పి.యు. లో మరలా మూడు యూనిట్లు ఉంటాయి.
అవి
మోనిటర్
మానిటర్ ని చూస్తుంటే మనకి టి.వి.(టెలివిజన్) గుర్తుకు వస్తుంది. మనకి టి.వి. లాగే మానిటర్ ఉపయోగపడుతుంది. మనం టి.వి.కి కేబుల్ జాక్ తీసివేస్తే మనకి టి.వి.లో ప్రోగ్రాములు ఏమీ రావు. అదేవిధంగా మానిటర్ ను సి.పి.యు. కి కనక్ట్ చేసిన జాక్ తీసివేస్తే మనకి మోనిటర్ లో ఏమీ కనిపించవు. టి.వీ. ల్లో లాగే మనకి రెండు రకాల మోనిటర్లు కనిపిస్తాయు.
అవి.
సాప్ట్ వేర్
కంప్యూటర్ ను మనకి కావలసిన విధంగా రన్ చేయడానికి కావలసిన కమాండ్స్ లనే మనం ప్రోగ్రాం అని పిలుస్తాము.ఈ విధమైన ఏ ప్రోగ్రాం నైనా మనం సాధారణంగా సాప్ట్ వేర్ అనే పదంతో పిలుస్తాము.
ఈ సాప్ట్ వేర్ రెండు రకాలు
1. సిస్టం సాప్ట్ వేర్
2. అప్లికేషన్ సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టం(Operating System)
విండోస్ ఆపరేటింగ్ సిస్టం అనేది మైక్రోసాప్ట్ కంపెనీ తయారుచేయబడి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టం లలో ఒకటి. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి గ్రాపిక్స్ కనిపించడం వలన దీనినే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ పేస్ అని పిలుస్తారు.ఈ విండోస్ బేసెడ్ ప్రతీ అప్లికేషన్ లోనూ మనకి సాదారణంగా ఒక మెనూబార్ కనిపిస్తుంది. ఈ మెనూబార్ లో చాలావరకు కామన్ ఆప్షన్స్ ఉండటం వలన విండోస్ బేసెడ్ ఒక అప్లికేషన్ మనం బాగా నేర్చుకుంటే, రెండవ అప్లికేషన్ మనకి టచ్ లేకపోయినా చాలావరకు రన్ చేయవచ్చు . ఆ పెసిలిటీ మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండవటం వలన దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
విండోస్ యొక్క విశిష్టతలు :
ప్లాపీ డిస్క్ , కాంపాక్ట్ డిస్క్
ప్లాపీ డిస్క్ , కాంపాక్ట్ డిస్క్ మొదలగు వాటిని మనం ఎక్ష్ టర్నల్ స్టోరేజ్ డెవైసెస్ అని పిలుస్తాము.కంప్యూటర్ లో ఉన్న ఏదినా ఇంపార్టెంట్ మేటర్ ను మనం కంప్యూటర్ తో పాటుగా వేరొక ఎక్ష్ టర్నల్ స్టోరేజ్ డెవైస్ లో కూడా లోడ్ చేసి ఉంచితే , భవిషత్తు లో కంప్యూటర్ లో ఉన్న డాటా పోతే తిరిగి ఈ ఎక్ష్ టర్నల్ స్టోరేజ్ డెవైస్ లో ఉన్న మేటర్ ని లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
కీబోర్డ్
కంప్యూటర్ లో డాటా ఎంటర్ చేయడానికి ఉపయోగించే పరికరాలనే ఇంపుట్ డివైసెస్ అని పిలుస్తారు. కీబొర్డ్ అనేది కంప్యూటర్ యొక్క ముఖ్యమైన ఇన్ పుట్ డివైస్ లలో ఒకటి. కీబొర్డ్ చూడటానికి టైప్ రైటర్ లా కనిపిస్తుంది. కీబొర్డ్ లో ఏ కీ టైప్ చేస్తే ఏమి వస్తుంది అనేది ఆ కీ పై ప్రింట్ చేయబడి ఉంటుంది.
కీబోర్డ్ లలో ఉన్న కీస్ ఆధారంగా కీబోర్డ్లు క్రింది విధంగా ఉంటాయి.
అవి
మైక్రో ప్రాసెసర్
కొన్ని IC ( ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్) లు కలిసి మైక్రో ప్రాసెసర్ గా ఏర్పడుతుంది. ఈ మైక్రో ప్రాసెసర్ గణిత పరిక్రియలను చేయగలుగుతుంది. దానికిచ్చే ఆదేశాలను అర్థం చేసుకోగలుగుతుంది. మైక్రో ప్రాసెసర్ తార్కిక నిర్ణయాలు కూడా తీసుకోగలదు. ఈ పనులన్నీ చేయడానికి దానికి నివేశ సాధనం (input device) కావాలి. నివేశ సాధనం ద్వారా దానికి కావలసిన దత్తాంశం (data) ఆదేశాల (instructions) ను ఇవ్వాలి. సాధారణంగా, ఒక కీ-బోర్డు
(key-board) లేదా మౌస్ (mouse) లను నివేశ సాధనాలుగా ఉపయోగిస్తారు.
కంప్యూటర్ మరియు ఇంటెర్‌నెట్
సి, సిప్లస్ ప్లస్ ,జావా
మనుష్యుల మధ్య సమాచార ప్రసారానికి ఒక మాధ్యమము అవసరము.ఈ మాధ్యమమే భాష. భాష అనేది లేకపోతే సమాచార వ్యవస్థ స్థ౦భి౦చిపోతు౦ది. ఎన్నో ఇబ్బ౦దులు ఎదురవుతాయి. అలాగే క౦ప్యుటరుతో మాట్లాడాలన్న ఒక భాష అవసరము. వీటినుపయోగి౦చి ప్రోగ్రాములు వ్రాయుట ద్వారా,క౦ప్యుటరుతో పనులు చేయి౦చుకోగలము. వీటినే ప్రోగ్రామి౦గ్ భాషలు అ౦టారు.
మీరు పోఇన జన్మలో ఎలా ఉన్నారూ తెలుసుకోవాలని ఉందా !!
మీరు పోఇన జన్మలో ఎలా ఉన్నారూ తెలుసుకోవాలని అందరికి ఈ ఆలోచన ఎపుడో ఒకపుడు వచివుంటుంది .ఈ వివరాలు తెలుసుకోవాలంటే మీ జన్మించిన తేదీని ఎంటర్ చెయ్యండి తెలుసుకోండి .
ప్రపంచంలోని అన్నీ రైల్వే సర్వీసులు ఒకే చోట
ఈ సైట్లో అన్నీ దేశాల రైల్వే సమాచారం, టికెట్ బుకింగ్స్, రూట్ మ్యాపింగ్ లభిస్తాయి.
చిన్న ఫోటోలను పెద్దగా చెయటానికి?
మీ దగ్గర వున్న చిన్న ఫోటోలను లను పెద్దగా చేసి ప్రింట్ తీసుకొటాని