iCafe Search
సి.పి.యు. అంటే
Monday 7 June 2010సి.పి.యు. అంటే సెంట్రల్ ప్రోసెసిం గ్ యూనిట్. మిగిలిన కంప్యూటర్ పార్ట్స్ అన్నీ కేబుల్ ద్వారా సి.పి.యు.కి కలపబడి ఉంటాయి. మనం కంప్యూటర్ కి ఇచ్చిన ఇంపర్ మేషన్ స్టోరేజ్, కాలిక్యులేషన్ అంతా కూడా సి.పి.యు. లోనే జరుగుతుంది.ఈ సి.పి.యు. లేకపోతే మిగిలిన కంప్యూటర్ పార్టులు పనిచేయవు. మనకి బ్రెయిన్ లేకపోతే మనం ఏపనీ చేయలేం. అలాగే సి.పి.యు. లేకపోతే మిగిలిన పార్టులు పనిచేయవు, కనుక సి.పి.యు.ని బ్రెయిన్ ఆప్ ది కంప్యూటర్ అని పిలుస్తారు.
ఈ సి.పి.యు. లో మరలా మూడు యూనిట్లు ఉంటాయి.
అవి
1. యం .యం. యు.
2. సి.యు
3. ఎ.ఎల్.యు.
1. యం .యం. యు. : యం .యం. యు. అంటే మెయిన్ మెమరి యూనిట్. మనం కంప్యూటర్ కి ఇచ్చిన మేటర్ స్టోరేజ్ అంతా ఈ యం .యం. యు. లోనే జరుగుతుంది.
2. సి. యు. : సి. యు. అంటే కంట్రోల్ యూనిట్ . ఇది మన కంప్యూటర్ పార్టులన్నింటినీ కంట్రోల్ చేస్తుంటుంది.
3. ఎ.ఎల్.యు. : ఎ.ఎల్.యు. అంటే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ . మనం కంప్యూటర్ కి ఇచ్చిన కాలిక్యులేషన్స్ అన్నీ ఈ ఎ.ఎల్.యు.లోనే జరుగుతాయి.
ఈ విధంగా సి.పి.యు. వర్క్ చేస్తుంది.