iCafe Search
కీబోర్డ్
Monday 7 June 2010కంప్యూటర్ లో డాటా ఎంటర్ చేయడానికి ఉపయోగించే పరికరాలనే ఇంపుట్ డివైసెస్ అని పిలుస్తారు. కీబొర్డ్ అనేది కంప్యూటర్ యొక్క ముఖ్యమైన ఇన్ పుట్ డివైస్ లలో ఒకటి. కీబొర్డ్ చూడటానికి టైప్ రైటర్ లా కనిపిస్తుంది. కీబొర్డ్ లో ఏ కీ టైప్ చేస్తే ఏమి వస్తుంది అనేది ఆ కీ పై ప్రింట్ చేయబడి ఉంటుంది.
కీబోర్డ్ లలో ఉన్న కీస్ ఆధారంగా కీబోర్డ్లు క్రింది విధంగా ఉంటాయి.
అవి
1. 83 కీస్ కీబోర్డ్
2. 87 కీస్ కీబోర్డ్
3. 101 కీస్ కీబోర్డ్
4. 104 కీస్ కీబోర్డ్
5. 106 కీస్ కీబోర్డ్
6. 112 కీస్ కీబోర్డ్
7. 121 కీస్ కీబోర్డ్
వీటిలో 83 మరియు 87 కీస్ కీబోర్డ్ లలో 10 పంక్షన్ కీస్ ఉంటాయి.101 కీస్ కీబోర్డ్ లలో 12 పంక్షన్ కీస్ ఉంటాయి, 104 నుండి ఉన్న కీబోర్డ్లలో 12 పంక్షన్ కీస్ మరియు కొన్ని స్పెషల్ కీస్ ఉంటాయి.
కీబోర్డ్ లో నాలుగు రకాల కీస్ ఉంటాయి.
అవి
1. ఆల్ఫాబెట్ కీస్ - A నుండి Z
2. నంబర్ కీస్ - 0 నుండి 9
3. పంక్షన్ కీస్ - F1 నుండి F12
4. స్పెషల్ కీస్ - ఎంటర్, స్పేస్ బార్ , కాప్స్ లాక్ , షిప్ట్ , బ్యాక్ స్పేస్, డిలీట్ మొదలగునవి.
నోట్ : ఇక్కడ బ్యాక్ స్పేస్, డిలీట్ కీస్ ను ఎరేజర్స్ అని పిలుస్తారు.