iCafe Search
మెమొరీ
Monday 7 June 2010కంప్యూటర్ లో మనం ఎంటర్ చేసిన మేటర్ అంతా కంప్యూటర్ యొక్క మెమొరీలో తిరిగి మనకి కావలసినపుడు ఉపయోగించుకునే విధంగా స్టోర్ అవుతుంది.తర్వాత ఈ మేటర్ లో ఏమైనా కాలిక్యులేషన్స్ ఉంటే ఇది సి.పి.యు.లో ఉన్న ఎ.ఎల్.యు. కి కాలిక్యులేషన్స్ కోసం పంపబదుతుంది.
కంప్యూటర్ లో రెండు రకాల మెమొరీలు ఉంటాయి.
అవి.
1. RAM : RAM అంటే రాండం అక్సెస్ మెమొరి. ఈ మెమొరీ లో స్టోర్ అయిన మేటర్ మనకి కరంటు ఉన్నంతవరకే (కంప్యూటర్ ఆన్ అయి ఉన్నంతవరకే) ఉంటుంది. దీనినే మనం వాలటైల్ మెమొరీ అని పిలుస్తాము.
2. ROM: ROM అంటే రీడ్ ఒన్లీ మెమొరి. దీనిలో ఒకసారి మనం మేటర్ ఎంటర్ చేస్తే తిరిగి దానిని మనం మార్చలేము. ఈ మెమొరీ లో ఉన్నమేటర్ పర్మినెంట్ గా ఉంటుంది. దీనేనే నాన్ వాలటైల్ మెమొరీ అని కూడా పిలుస్తారు.
కంప్యూటర్ యొక్క మెమొరీని మనం బైట్స్ లలో కొలుస్తాము.
8 బిట్స్ = 1 బైట్
1024 బైట్స్ = 1 కిలో బైట్ (KB)
1024 కిలో బైట్స్ = 1 మెగా బైట్ (MB)
1024 మెగా బైట్స్ = 1 గిగా బైట్ (GB)
1024 గిగా బైట్స్ = 1 టెర్రా బైట్ (TB)
నోట్: ఇక్కడ బిట్ అంటే ఒక అక్షరం (లేదా)ఒక బొమ్మలోని అతిచిన్న భాగము అని చెప్పవచ్చు.