iCafe Search
మైక్రో ప్రాసెసర్
Monday 7 June 2010కొన్ని IC ( ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్) లు కలిసి మైక్రో ప్రాసెసర్ గా ఏర్పడుతుంది. ఈ మైక్రో ప్రాసెసర్ గణిత పరిక్రియలను చేయగలుగుతుంది. దానికిచ్చే ఆదేశాలను అర్థం చేసుకోగలుగుతుంది. మైక్రో ప్రాసెసర్ తార్కిక నిర్ణయాలు కూడా తీసుకోగలదు. ఈ పనులన్నీ చేయడానికి దానికి నివేశ సాధనం (input device) కావాలి. నివేశ సాధనం ద్వారా దానికి కావలసిన దత్తాంశం (data) ఆదేశాల (instructions) ను ఇవ్వాలి. సాధారణంగా, ఒక కీ-బోర్డు
(key-board) లేదా మౌస్ (mouse) లను నివేశ సాధనాలుగా ఉపయోగిస్తారు.
నివేశ సాధనం ద్వారా అందించే దత్తాంశం రెండు రకాలుగా ఉండొచ్చు. ఉదాహరణకి విద్యార్థులు, వివిధ విషయాలలో పొందిన మార్కులను తీసుకుందాం. దీని నుండి తరగతి మార్కుల సరాసరి శాతాన్ని గణించవచ్చు. ఇక్కడ “దత్తాంశం” (data) మార్కులు. ఈ దత్తాంశాన్ని “సంఖ్యాత్మక (numeric)-దత్తాంశం” అంటారు. కొన్నిసార్లు, విధ్యార్థి పేరు, క్రమసంఖ్య, చిరునామాల వంటి సంఖ్యాత్మకం కాని (non-numeric) దత్తాంశాలు కూడా అవసరమౌతాయి. ఈ విధంగా సరఫరా చేయాల్సిన దత్తాంశాలు సంఖ్యాత్మక, సంఖ్యాత్మకం కానివిగా రెండు వర్గాలున్నాయి.
ఇచ్చిన ఆదేశాల మేరకు, దత్తాంశం కార్యసరణమౌతుంది (processed). ఆదేశాల సముదాయాన్ని
ప్రోగ్రాం (program) అంటారు.
మైక్రో ప్రాసెసర్ లో “కంట్రోల్ యూనిట్”(CU) అనే ఒక సాధనం ఉంటుంది. ఈ కంట్రోల్ యూనిట్ పంపే సంకేతాలను డీ కోడర్ (decoder) అనే సాధనం అర్థవివరణ (interpret) చేస్తుంది. దీనిలో, దత్తాంశాన్ని, ప్రోగ్రాం ను తాత్కాలికంగా నిలువ చేసేందుకు మెమో రి (Memory) అనే రెండవ సాధనం ఉంటుంది. మైక్రో ప్రాసెసర్ లోని చివరి సాధనం అరిథ్మేటిక్-లాజిక్-యూనిట్ (ALU). అన్ని రకాల గణిత, తార్కిక, సంబంధ గణనలన్నింటిని ALU చేస్తుంది. ఎప్పుడైతే, ఈ గణనలన్నీ పూర్తి అవుతుందో, అప్పుడు, ఫలితాలను ” నిర్గమ సాధనం” (output device) నకు పంపబడతాయి . సాధారణంగా ఒక ప్రింటరు (printer) లేదా మానిటరు (monitor) అనే సాధనాలు ఈ సాధనాలుగా ఉపయోగపడతాయి.
ఆ విధంగా మైక్రో ప్రాసెసరులో మూడు సాధనాలుంటాయి. (i) కంట్రోల్ యూనిట్,(ii) మెమొరీ, (iii)అరిథ్మేటిక్-లాజిక్-యూనిట్. ఈ మూడింటిని కలిపి ప్రధాన కార్యసరణ భాగం (Central Processing Unit, CPU) అంటారు