iCafe Search
ప్లాపీ డిస్క్ , కాంపాక్ట్ డిస్క్
Monday 7 June 2010ప్లాపీ డిస్క్ , కాంపాక్ట్ డిస్క్ మొదలగు వాటిని మనం ఎక్ష్ టర్నల్ స్టోరేజ్ డెవైసెస్ అని పిలుస్తాము.కంప్యూటర్ లో ఉన్న ఏదినా ఇంపార్టెంట్ మేటర్ ను మనం కంప్యూటర్ తో పాటుగా వేరొక ఎక్ష్ టర్నల్ స్టోరేజ్ డెవైస్ లో కూడా లోడ్ చేసి ఉంచితే , భవిషత్తు లో కంప్యూటర్ లో ఉన్న డాటా పోతే తిరిగి ఈ ఎక్ష్ టర్నల్ స్టోరేజ్ డెవైస్ లో ఉన్న మేటర్ ని లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా ఉపయోగించే ఎక్ష్ టర్నల్ స్టోరేజ్ డెవైసెస్
1. ప్లాపీ డిస్క్
2. కాంపాక్ట్ డిస్క్
3. హార్డ్ డిస్క్
1. ప్లాపీ డిస్క్: ఈ ప్లాపీ డిస్క్ యొక్క సైజ్ 1.44 మెగా బైట్స్ ఉంటుంది. మనం ఈ ప్లాపీ లో మేటర్ స్టోర్ చేసుకోవచ్చు, మరలా అవసరం లేకపోతే చెరిపివేసి ఆ ప్లాపీని రీ యూజ్ చేసుకోవచ్చు.
కానీ ఈ ప్లాపీలను ప్రస్తుతం పెద్దగా ఉపయోగించడం లేదు.
2.కాంపాక్ట్ డిస్క్: కాంపాక్ట్ డిస్క్ నే మనం సిడి అని పిలుస్తాము. ఈ సిడి లో మనం మేటర్ లోడ్ చేయాలంటే మన దగ్గర సిడి రైటర్ ఉండాలి. మనదగ్గర సిడి రైటర్ ఉంటే మనం సిడి లు చూడవచ్చు మరియు క్రొత్త సిదిలు రైట్ చేసుకోవచ్చు. ఈ సిడి యొక్క కెపాసిటీ 700 మెగా బైట్స్. ఈ సిడి లో మనం మేటర్ని ఒకసారి ఎంటర్ చేస్తే తిరిగి దానిని మనం మార్చలేము. అదే రీ రైటబుల్ సిడి అయితే మనం ఎంటర్ చేసిన మేటర్ ను తిరిగి మార్చుకోవచ్చు.
నోట్: సిడి తర్వాత వాటికి అడ్వాన్స్ డ్ గా మన మార్కెట్ లోకి డి.వి.డి. లు వచ్చాయి. ఈ డి.వి.డి. లు యొక్క సైజ్ 4.7 గిగా బైట్స్ ఉంటుంది. మన దగ్గర డి.వి.డి. రైటర్ ఉంటే సిడిలు, డివిడిలు చూడవచ్చు మరియు క్రొత్తవి తయారు చేసుకోవచ్చు.
3. హార్డ్ డిస్క్: హార్డ్ డిస్క్ అనేది కంప్యూటర్ లో బిగించబడి ఉంటుంది. ఈ హార్డ్ డిస్క్ లలో కూడా మనం మేటర్ ను స్టోర్ చేసుకోవచ్చు మరియు అవసరం లేనపుడు తిరిగి తీసివేయవచ్చు. ఈ హార్డ్ డిస్క్ ను కూడా మనం ఒక కంప్యూటర్ నుండి వేరొక కంప్యూటర్ కి మార్చుకోవచ్చు. ఈ హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ కూడా గిగా బైట్స్ లో ఉంటుంది. మొట్టమొదట తయారు చేసినపుడు ఈ హార్డ్ డిస్క్ సైజ్ 4.5 గిగా బైట్స్ గా ఉండేది. కానీ ఇప్పుడు హార్డ్ డిస్క్ లన్నీ 80GB , 160GB, 250GB లలో ఎక్కువగా లబిస్తున్నాయి.