iCafe Search
సాప్ట్ వేర్
Monday 7 June 2010కంప్యూటర్ ను మనకి కావలసిన విధంగా రన్ చేయడానికి కావలసిన కమాండ్స్ లనే మనం ప్రోగ్రాం అని పిలుస్తాము.ఈ విధమైన ఏ ప్రోగ్రాం నైనా మనం సాధారణంగా సాప్ట్ వేర్ అనే పదంతో పిలుస్తాము.
ఈ సాప్ట్ వేర్ రెండు రకాలు
1. సిస్టం సాప్ట్ వేర్
2. అప్లికేషన్ సాప్ట్ వేర్
కంప్యూటర్ కొన్న తరువాత మనం మొట్టమొదటగా ఆ కంప్యూటర్ లో మనం ఆపరేటింగ్ సిస్టం లోడ్ చేయాలి.
1. ఆపరేటింగ్ సిస్టం : కంప్యూటర్ కి మనం ఏ కమాండ్ ఇచ్చినా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇస్తాము. కానీ కంప్యూటర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు. కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది బైనరీ లాంగ్వేజ్. ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్ మనకి , మన లాంగ్వేజ్ కంప్యూటర్ కి రావు కనుక కంప్యూటర్ కు యూజర్ కి మధ్య ఒక ట్రన్స్ లేటర్ కావాలి. ఈ విధంగా మనం ఉపయోగించే ట్రన్స్ లేటరే మన ఆపరేటింగ్ సిస్టం.
ఉదా: MS-DOS, WINDOWS-95, WINDOWS-98, WINDOWS-XP, WINDOWS -NT, MAC OS, LINUX ETC.
2. సిస్టం సాప్ట్ వేర్ : మనం ఏదైనా ఒక కంప్యూటర్ పార్టు క్రొత్తగా తీసుకున్నపుడు ఆ పార్టుతో పాటుగా మనకి ఇచ్చే సాప్ట్ వేర్ నే సిస్టం సాప్ట్ వేర్ అని పిలుస్తాము. ఈ సిస్టం సాప్ట్ వేర్ లోడ్ చేస్తేనే ఆ పార్ట్ మనకి కావలసిన విధముగా పనిచేస్తుంది. ఆపరేటింగ్ సిస్టం లోడ్ చేసిన తరువాత మనం లోడ్ చేసే మదర్ బోర్డ్ సిడి, ప్రింటర్ సిడి వగైరా లన్నీ ఈ కోవకు చెందినవే.
3. అప్లికేషన్ సాప్ట్ వేర్: యూజర్ చేత మనకి కావలసిన విధంగా తయారు చేసిన ప్రోగ్రాం లనే అప్లికేషన్ సాప్ట్ వేర్ అని పిలుస్తారు. ఈ అప్లికేషన్ సాప్ట్ వేర్ లను మనం ఏ అవసరార్ధం తయారుచేయించుకున్నామో వాటికి మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి వాటినే పాకేజెస్ అని కూడా పిలుస్తారు.
ఉదా : MS-OFFICE XP, PHOTOSHOP, PAGEMAKER ETC