iCafe Search
ఆపరేటింగ్ సిస్టం(Operating System)
Monday, 7 June 2010విండోస్ ఆపరేటింగ్ సిస్టం అనేది మైక్రోసాప్ట్ కంపెనీ తయారుచేయబడి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టం లలో ఒకటి. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి గ్రాపిక్స్ కనిపించడం వలన దీనినే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ పేస్ అని పిలుస్తారు.ఈ విండోస్ బేసెడ్ ప్రతీ అప్లికేషన్ లోనూ మనకి సాదారణంగా ఒక మెనూబార్ కనిపిస్తుంది. ఈ మెనూబార్ లో చాలావరకు కామన్ ఆప్షన్స్ ఉండటం వలన విండోస్ బేసెడ్ ఒక అప్లికేషన్ మనం బాగా నేర్చుకుంటే, రెండవ అప్లికేషన్ మనకి టచ్ లేకపోయినా చాలావరకు రన్ చేయవచ్చు . ఆ పెసిలిటీ మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండవటం వలన దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
విండోస్ యొక్క విశిష్టతలు :
1. ఇది ఒక పాకేజ్ .
2. ఇది ఒక సింగిల్ యూజర్ మరియు మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టం .
3. ఈ ఆపరేటింగ్ సిస్టం నెట్ వర్క్ కనెక్షన్స్ కు మరియు పెద్ద పైల్ పేర్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
4.ఈ ఆపరేటింగ్ సిస్టం లో ఉన్న ప్లగ్ అంద్ ప్లే పీచర్ ద్వారా క్రొత్త పరికరాలను కంప్యూటర్ కి కలిపిన వెంటనే వాటిని డిటెక్ట్ చేస్తుంది.
5.ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న 32 బిట్ మల్టిటాస్కింగ్,ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రాం లను ఒకే టైం లో రన్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ అయ్యేందుకు సహకరిస్తుంది.
6.ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఇంప్రూవ్డ్ సర్చ్ పెసిలిటీ ద్వారా మనకు కావాలసిన పైళ్ళు, లెడా సిస్టం లను ఈజీ గా పైండ్ చేయవచ్చు.
7.ఈ ఆపరేటింగ్ సిస్టం మల్టిమీడియాకు బాగా సహకరిస్తుంది.
8.ఈ ఆపరేటింగ్ సిస్టం ఇంటర్నెట్ , ఇమెయిల్,పాక్స్ వంటివాటికి బాగా సపోర్ట్ చేస్తుంది.
ఈ ఆపరేటింగ్ సిస్టం తో పాటు మనకు వచ్చే కొన్ని అప్లికేషన్స్
1. పెయింట్ బ్రష్
2. నోట్ పేడ్
3. వర్డ్ పేడ్
4. కాలిక్యులేటర్
5. అడ్రస్ బుక్