iCafe Search
ఇన్స్టెంట్ మెసెంజర్
Monday 7 June 2010Yahoo, GTalk, MSN, AIM, Jabber వంటి అనేక ఇన్స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాములు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. వీటి ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడడం మాట అటుంచితే విలువైన పని గంటలు వృధా అవడం, తెలిసీతెలియక యువత పెడదారి పట్టడం, వ్యక్తిగత సమాచారం ఎవరికి బడితే వారికి చెప్పడం వంటి అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో మీ కంప్యూటర్లో Yahoo,Google Talk, MSN, AIM,Odigo, PalTalk, QQ Messenger, Jabber, IMessenger.Net, AOL, IRC, ICQ, GAIM వంటి ఏ రకమైన ఇన్స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాం పనిచేయకుండా లాక్ చెయ్యడానికి http://www.comvigo.com/downloadIMLock/IMLSetup.exe అనే వెబ్ సైట్లో లభించే Im Lock Home Edition అనే ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాం సహాయంతో అవసరం అనుకుంటే iTunes, Internet Explorer, Skype ప్రోగ్రాములు సైతం పనిచెయ్యకుండా లాక్ చేసుకోవచ్చు. ప్రైవసీ,సెక్యూరిటీ కోరుకునేవారికి పనికొచ్చే సాప్ట్ వేర్ ఇది.