iCafe Search
Yahoo Mailకి డెస్క్ టాప్ నుండి షార్ట్ కట్ ఇలా!
Thursday, 10 June 2010Yahoo Mailని నేరుగా మీ డెస్క్ర్ టాప్ నుండి యాక్సెస్ చేసుకోగలిగే టెక్నిక్ ఒకటి ఉంది. అదేమిటంటే డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకోండి. వెంటనే వచ్చే డైలాగ్ బాక్స్ లో Command Line లేదా Type the location of the item అనే ప్రదేశం వద్ద ఉండే ఖాళీ బాక్స్ల్ లో..
Gmail Tips (మీ ఆఫీసులో జిమెయిల్ బ్లాక్ చేయబడిందా )
Wednesday, 9 June 2010తమ ఉద్యోగుల పని గంటలు వృధా పరుస్తారన్న ఉద్దేశ్యంతో కొన్ని కంపెనీలు జిమెయిల్ వంటి కొన్ని వెబ్ సైట్లని ఓపెన్ చేయడానికి వీల్లేకుండా బ్లాక్ చేస్తుంటాయి. వాస్తవానికి మీకు వేలాది రూపాయలు జీతం ఇస్తున్న కంపెనీ నియమాలకు కట్టుబడి ఉండడం మీ కర్తవ్యమ్. అయితె ఒక్కోసారి అర్జెంట్ గా మెయిల్ తనిఖీ చేసుకోవలసి వచ్చింది. ఒక ప్రక్క చూస్తేనేమో.. జిమెయిల్ మీ ఆఫీసులో నిషేదించబడింది. అలాంటప్పుడు http://mail.google.com/ అనే వెబ్ సైట్ అడ్రస్ ఉపయోగించడానికి బదులుగా https://mail.google.com అనే అడ్రస్ ని వాడి చూడండి. చాలావరకూ జిమెయిల్ ఒపెనవుతుంది. ఒకవేళ అప్పటికీ ఫలితం లేకపొతే ఈ క్రింది అడ్రస్ లూ ప్రయత్నించండి.