iCafe Search
విండోస్ Xp Intalling
Tuesday 15 June 2010* విండోస్ Xp Intalling & Formating
* మొదట BIOS లో first boot device ని cdrom/rw(or DVD) కి సెట్ చెయ్యండి. (లేక పొతే సిస్టం స్టార్ట్ చేసి కూడా boot device ఎంచుకోవచ్చు. కానీ ఒక్కో సిస్టం కి ఒక్కో కీ ఉంటుంది, మోడల్ ని బట్టి)
* ఇప్పుడు విండోస్ సీడి cd/dvd డ్రైవ్ లో ఉంచి సిస్టం రీస్టార్ట్ చెయ్యండి.
* ఇప్పుడు సిస్టం press a key to boot from cd/dvd అని చూపుతుంది. అలా చూపగానే ఒక కీ నొక్కండి.
o ఇప్పుడు సీడి కొన్ని ఫైల్స్ ని లోడ్ చేసి ఒక blue screen చూపుతుంది. ఇప్పుడు అసలు ఇన్స్టాల్ ప్రాసెస్ మొదలవుతుంది.
o ఇప్పుడు install xp, repair xp అని రెండు ఆప్షన్స్ చూపుతుంది.
o ఇప్పుడు license agreement page చూపుతుంది. F8 బటన్ నొక్కండి.
+ ఇప్పుడు హార్డ్ డ్రైవ్ చెక్ చేసి, ఉన్న పార్టిషన్స్ చూపుతుంది.(కొత్తగా ఇన్స్టాల్ చేస్తుంటే పార్టిషన్స్ ఉండవు. మనమే చేసుకోవాలి.)
+ ఒకవేళ ఉన్న పార్టిషన్ ని తీసేసి కొత్తగా సృష్టించుకోవాలంటే, ఏదైతే తీసేయ్యాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకుని, D నొక్కండి. అది, ఖచ్చితంగా తీసేయోచ్చా అని అడుగుతుంది. తీసెయ్యాలి అనుకుంటే L కొట్టండి. లేకపొతే ఎస్కేప్ కొట్టి వెనక్కువెళ్ళండి.
+ కొత్తగా పార్టిషన్స్ చెయ్యడానికి, Unpartitioned Space మీదకి వచ్చి, c నొక్కండి.
# ఇప్పుడు మొత్తం స్పేస్ లో ఎన్ని పార్ట్టిషన్స్ చెయ్యాలో అంచనా వేసి, ఈ పార్టిషన్ కి ఎంత స్పేస్ ఇవ్వాలో నిర్ణయించుకుని, ఆ నెంబర్ ఇవ్వండి. (స్పేస్ మెగాబైట్లు గా చూపుతుంది. ఉదాహరణకి, మీరు 15000 అని ఇస్తే ఆ డ్రైవ్ 15GB ఉంటుంది)
# తర్వాత os ఇన్స్టాల్ చేయడానికి డ్రైవ్ ఎంచుకోండి.(సాధారణంగా మొదటి డ్రైవ్ ఎంచుకుంటారు.)
# ఇప్పుడు డ్రైవ్ ఫార్మటు చూపుతుంది. ఇక్కడ ntfs(quick format) ఎంచుకోండి.
# ఇప్పుడు డ్రైవ్ ఫార్మాట్ అయ్యి ఫైల్ సిస్టం లోడ్ అవుతుంది.
* తర్వాత OS ఫైల్స్ డ్రైవ్ లోనికి కాపీ అవుతాయి. మొత్తం ప్రాసెస్ పూర్తైన తర్వాత సిస్టం రీస్టార్ట్ అవుతుంది.
* ఇప్పుడు డ్రైవ్ లో లోడ్ ఐన ఫైల్స్ నుండి ఇన్స్టలేషన్ కొనసాగుతుంది. (స్క్రీన్ GUI గా మారుతుంది.)
* ఇక్కడ సిస్టం language selection, keyboard layout selection అడుగుతుంది. english(US) ఎంచుకోండి. default గా అదే ఉండి ఉంటుంది చూడండి . next నొక్కితే పేరు, ఆర్గనైజేషన్ వివరాలు అడుగుతుంది, ఇంట్లో పీసీ ఐతే ఆర్గనైజేషన్ ఏదోటి ఇచ్చేయ్యండి.
* తర్వాత product key అడుగుతుంది. సీడి పైన ఉన్న 25 digit key ని ఎంటర్ చెయ్యండి.
* ఇప్పుడు System Name, Administrator Password అడుగుతుంది. ఆ రెండు ఎంటర్ చెయ్యండి.(Administrator Password ఇవ్వక పోయిన పర్వాలేదు.
* ఇప్పుడు date, time, time zone వివరాలు అడుగుతుంది. time zone ని new delhi, kolkata, mumbai, chennai(GMT+5:30) గా ఎంచుకోండి.
* ఇప్పుడు network setup చూపుతుంది. ఇక్కడ domain default settings గా ఎంచుకోండి. Next నొక్కితే మీ workgroup ఏంటో అడుగుతుంది, తెలిస్తే మీకు కావాల్సిన గ్రూపు పేరే ఇవ్వండి, లేకుంటే WORKGROUP అని ఉంచేయ్యండి.
o ఇప్పుడు next నొక్కగానే మొత్తం ఇన్స్టలేషన్ పూర్తవుతుంది.
o తర్వాత సిస్టం రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్నిటికి Ok/Next కొట్టుకుంటూ వచ్చేయ్యండి (క్రిందున్న తెరపట్టులు చూడండి). చివరి స్టెప్పులో username ఎంటర్ చేయండి. తర్వాత వచ్చే network check ni skip చెయ్యండి.
o ఇక్కడ నెట్వర్క్ చెక్ వస్తుంది, దాన్ని దాటవేసేయ్యండి(skip).
+ ఇప్పుడు మీ login screen, desktop కాన్ఫిగర్ అవుతాయి. తర్వాత మీ ఎకౌంటు లోనికి login అవుతుంది.
+ దీనితో ఇన్స్టలేషన్ పూర్తి అవుతుంది.
+ సిస్టం పూర్తిగా పని చేయడానికి మీకు సిస్టం తో పాటు ఇచ్చిన system driver cd నుంచి డ్రైవర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయండి.