iCafe Search
Windows XP Live CD ని సొంతంగా తయారు చేస్కొండి.
Sunday, 13 June 2010విండోస్ xp కరప్ట్ అయి అసలు కంప్యూటర్ ను ఓపెన్ చేయలేని పరిస్థితులలో c: డ్రైవ్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ ను బ్యాకప్ చేయడానికి ఈ విండోస్ లైవ్ సీడీ బాగా ఉపయోగపడుతుంది. విండోస్ లైవ్ సీడీ ద్వారా బూట్ అయితే ఇక అచ్చం మీ విండోస్ xp తో మీ కంప్యూటర్ ను ఎలా ఓపెన్ చేస్తారో అలాగే ఉంటుంది. రన్నింగ్ కంప్యూటర్లో మీరు అన్నీ డ్రైవ్ లను ఎలా చూడగలగుతారో అలాగే విండోస్ లైవ్ సీడీ ద్వారా కరప్టడ్ కంప్యూటర్ ను ఓపెన్ చేసి అన్నీ డ్రైవ్ లను యాక్సెస్ చేసి అందులోని ఫైల్లని కాపీ పేస్ట్ మరియు రైటింగ్ కూడా చేయవచ్చు.
విండోస్ లైవ్ సీడీని ఎలా తయారు చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
1. ఇక్కడ క్లిక్ చేసి pebuilder ను డౌన్లోడ్ చేస్కొండి.
2. ఇక్కడ క్లిక్ చేసి xpe-1.0.7.cab ప్లగ్గిన్ ను డౌన్లోడ్ చేయండి.
మరియు ఇతర ప్లగ్గిన్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.(మిగిలనవి పెద్దగా అవసరం ఉండదు. ఐతే వాటివల్ల లైవ్ సీడీలో అదనపు ఫీచర్స్ పొందగలము)
3. తర్వాత విండోస్ xp సీడీని మీ సీడీ డ్రైవ్ లో ఉంచండి.
4. మొదట డౌన్లోడ్ చేసిన pebuilder ను ఇన్స్టాల్ చేయండి. వాల్ పేపర్ ను ఛేంజ్ చేయాలనుకుంటే C:\pebuilder3110a\bartpe.bmp ని తీసివేసి మీకిష్టం వచ్చిన వాల్ పేపర్ ను రీప్లేస్ చేయండి.
5. తర్వాత pebuilder ఓపెన్ చేసి ఈ క్రింది విధంగా సెట్ చేయండి.
7. మీరు ఇంతకు ముందు డౌన్లోడ్ చేసిన ప్లగ్గిన్స్ ను ఈ క్రింది విధంగా యాడ్ చేయండి.
8. వెంటనే nu2shell ,startup group ఈ రెండు ప్లగ్గిన్స్ ను ఈ క్రింది విధంగా డిజేబుల్ చేయండి. వాటి ఎదురుగా No అని ఉండాలి.
9. తర్వాత ISO ఆప్షన్ సెలెక్ట్ చేసి బ్యుల్డ్ చేసి ఆ ఇమేజ్ ఫైల్ ను నీరో సాఫ్ట్వేర్ ద్వారా సీడీలోకి రికార్డ్ చేయండి.
ఇక విండోస్ లైవ్ సీడీ రెడీ అయినట్లే.